TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉన్నామో పోయామో చూట్టానికి వచ్చారా.. మంత్రిని తరిమికొట్టిన వరద బాధితులు.. 

Published on: Tue Nov 23, 2021 3:41PM

నెల్లూరు జిల్లాలు వర్షాలు తగ్గినా వరద బాధలు మాత్రం కొనసాగుతున్నాయి. ముంపు గ్రామాల్లో ఇప్పటికి దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా గ్రామాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. వరద ప్రాంతాల్లో అధికారులు నిర్లక్ష్యంగా పని చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్నా తమను ఎవరూ పట్టించుకోలేదని బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వరద ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. మంత్రి బాలినేనితో పాచు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని, కలెక్టర్ చక్రధర్ ను తరిమి తరిమి కొట్టారు నెల్లూరు జిల్లా వరద బాధితులు. తామంతా  నష్టపోయిన తర్వాత సినిమా చూడటానికి వచ్చారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి, ఎమ్మెల్యే,  కలెక్టర్ పై  ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారితో వాగ్వాదానికి దిగారు వరద బాధితులు. దీంతో పోలీసులు మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్ ను అతి కష్టం మీద అక్కడి నుంచి తరిలించారు.