శివయ్యపై ఇద్దరు నాగేంద్రుల దర్శనం
Published on: Sat Oct 25, 2025 3:36PM

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి దేవస్థానంలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. దేవస్థాన పరిసరాల్లో నాగేంద్రుడు సంచరిస్తున్న సంగతి భక్తులకు తెలిసిందే.
అయితే, తాజాగా ఉదయం తెల్లవారుజామున ఇద్దరు నాగేంద్రులు ఒక్కసారిగా విశ్వనాథ స్వామి సన్నిధిలో ప్రత్యక్షమై భక్తులకు దర్శనమిచ్చారు. అందులో ఒక నాగేంద్రుడు శ్వేతనాగ రూపంలో కనిపించి, భక్తులందరికీ కడువిందు చేసినట్లు అక్కడివారు తెలిపారు. ఇప్పటివరకు ఒకే నాగేంద్రుడు దర్శనమిచ్చిన ఈ దేవస్థానంలో ఇద్దరు నాగేంద్రులు ప్రత్యక్షమవడం విశేషంగా మారి, మనుబోలు ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.


