నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం...ఏడుగురు మృతి
Published on: Wed Sep 17, 2025 3:12PM
.webp)
నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన గ్రామ సమీపంలో నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ఇసుక టిప్పర్ ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఏడు మంది కారులోనే మృతి చెందారు. నలుగురు పురుషులు ఇద్దరు మహిళలు ఒక పాప మొత్తం 7 మంది చనిపోయినట్లు తెలుస్తుంది.
ఈ కారును అనంతసాగరం మండలం పరమటి కంభంపాడు ఇసుకరీచ్ నుండి ఇసుకను తరలిస్తున్న ఇసుక లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. చనిపోయిన వారు నెల్లూరు జిల్లా కేంద్రంలోని ముత్తుకూరు గేటు సమీపంలో గుర్రం వారి వీధి కి చెందినవారుగా తెలిసింది.. చనిపోయిన వారి సమాచారం మేరకు మృతులు టి రాధా, శేషం సారమ్మ, నల్లగొండ లక్ష్మి, శేషం తేజ, శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు. మరొకరి పేరు తెలియవలసి ఉంది.. ఆత్మకూరులో ఒకరిని పరామర్శించేందుకు ప్రభుత్వ వైద్యశాల వద్దకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.


