ఆనం నోట లోఫార్లు ... ఢాఫార్లు ...
Published on: Mon Apr 9, 2012 11:21AM
ఆనం నోట లోఫార్లు ... ఢాఫార్లు ...
వివేకం కోల్పోతున్న వివేకానంద రెడ్డి!
నెల్లూరు జిల్లాలో ఆనం వివేకానందరెడ్డి వ్యవహార శైలి తీవ్రవిమర్షలకు గురవుతోంది. ఆయన హావభావాలు జిల్లా ప్రజలకు ఇప్పటికే వెగటు పుట్టించాయి. ఇప్పుడు ఆయన దీనికి తోడు తన ప్రత్యర్థులపై కర్ణకఠోరమైన, నోటితో ఉచ్చరించడానికి వీలులేని భాషను వాడుతూ పరువును దిగజార్చుకుంటున్నారు. అయితే ఆయన ప్రత్యర్థులు మాత్రం ఆనం వివేకానందరెడ్డికి అసలు పరువు ఉంటేనే కదా దిగజార్చుకోవడానికి అంటున్నారు. కోవూరు ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా రావడంతో కొంతకాలం ఆయన మౌనంగానే ఉన్నారు. ఈలోగా జగన్ వర్గం ఎం.ఎల్.ఎ.ల రాజీనామాలు ఆమోదించడంతో మరోసారి ఉప ఎన్నికలు వచ్చిపడ్డాయి. ఈ ఎన్నికలు ఆనం వివేకానందరెడ్డికి టెన్షన్ పుట్టిస్తున్నాయని ఆ టెన్షన్ లో ఆయన తన ప్రత్యర్థులను లోఫర్లు , ఢాఫార్లు, ఈడియెట్లు అంటూ దుర్భాషలు ఆడుతున్నరన్న విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు ఒకవైపు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ, మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శల జడివానలో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ రెండు పార్టీల నాయకులు నిత్యం ఏదో అంశంపై ఆనం వివేకానందరెడ్డిని, ఆయన సోదరుడు మంత్రి అయిన ఆనం రామ్ నాయారాయణ రెడ్డిని ఎండగడుతున్నారు. గతంలో వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని సంతకాలు పెట్టిన ఆనం వివేకానందరెడ్డి ఇప్పుడు జగన్ పార్టీకి వ్యతిరేకంగా ఎలా ప్రచారం చేస్తారని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. జగన్ అవినీతిపై ఆనం మాట్లాడినప్పుడల్లా వై ఎస్ ఆర్. కాంగ్రెస్ నేతలు ఆనం అవినీతి చిట్టాను విప్పి ఆయన పరువు మంటగాలుపుతున్నారు. ఆయన గతాన్ని తవ్వి తీసి నెల్లూరు జిల్లా ప్రజలకు గుర్తు చేస్తున్నారు. 15 సంవత్సరాల క్రితం ఎ.సి. సెంటర్ లో నిలబడి టీ, సిగరెట్ల కోసం స్నేహితుల నుంచి అప్పుతీసుకుని వాటిని ఎగ్గొట్టిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రత్యర్థులు ఎన్ని మాట్లాడినా ఆనం తన వైఖరిని మాత్రం మార్చుకోలేక పోతున్నారు.


