TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆనం సోదరుల అవినీతికి అంతే లేదా?

Published on: Mon Apr 9, 2012 6:09AM

ఆనం సోదరులు నెల్లూరుజిల్లా రాజకీయాలను శాసిస్తున్నారు. అధికారులను ఆటాడిస్తున్నారు. కాంట్రాక్టర్లను బెంబేలెత్తిస్తున్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ పరధిలో చేపట్టే ప్రభుత్వ పనుల్లో వీరికి కోట్లాది రూపాయల ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. నగరంలోని 50 డివిజన్లలో కల్వర్టులు, సీసీరోడ్లు, సైడుకాల్వలు, ప్యాచ్ వర్కులు చేపట్టేందుకు రూ. 20 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులన్నీ ఆనం సోదరులు బినామీ పేర్లతో చేజిక్కించుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల రూ.18 కోట్లకు వేసిన ఇతర టెండర్లలో ఆనం సోదరులకు రూ. 6 కోట్లు ముడుపుల రూపంలో ముట్టినట్టు తెలిసింది. తమ మాట వినని కాంట్రాక్టర్లను వీరు ఇబ్బందులు పెడతారని, తాము చెప్పినట్లు చేయని అధికారులను ఆనం సోదరులు బదిలీలు చేయిస్తుంటారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఆనం సోదరుల తీరుపై ప్రత్యర్థి పార్టీలు పలు ఆరోపణలు చేస్తున్నా వారి వైఖరిలో మార్పేమీ రావడం లేదు.