TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నెల్లూరు జిల్లాలో 4000 వేల ఎకరాల భూమి కబ్జా

Published on: Tue Feb 28, 2012 3:57PM

నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లాలోని కనిగిరి రిజర్వాయర్ కబ్జాకోరల్లో చిక్కుకుంది. దీంతో ఆయకట్టు భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. దురాక్రమణదారుల కబ్జాలపై రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. కనిగిరి రిజర్వాయర్ కింద సంగం మండలంలో పెద్దగా ఆయకట్ట లేదు. రిజర్వాయర్ ఎగువభాగం మండల పరిధిలో ఉంది. పడమటి వైపున జంగాల కండ్రిక, వంగల్లు, గాంధీ జనసంఘం, సిద్దిపురం, దువ్వూరు గ్రామాలున్నాయి. కొన్నేళ్ళ నుంచి రిజర్వాయర్ పడమటి వైపు ఉన్న మెట్టభూమి అంచలంచలుగా కబ్జాకు గురవుతూ ఉంది. అయినా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. రిజర్వాయర్ భూమి అనధికారికంగా అమ్మేస్తున్నారు.రిజర్వాయర్ పూడిక పేరుకుపోతుండటంతో నీటి సామర్ధ్యం బాగా పడిపోయింది. రిజర్వాయర్ ముందుభాగాన మాత్రం నీరు ఉండటం, పడమటి వైపు మిట్ట తేలిపోవడంతో అక్కడ భూమి సారవంతమైన సాగుకు అనుకూలంగా మారింది. దీంతో బడాబాబుల కళ్ళు దీనిపై పడ్డాయి. తొలుత  రిజర్వాయర్ లో ఆయిల్ మోటార్లు ఏర్పాటు చేసుకుని వరి, పత్తి సాగుచేస్తుండేవారు. బడాబాబులు క్రమేణా రిజర్వాయర్ లో విధ్యుత్ లైన్లు ఏర్పాటు చేసుకున్నారు. కాలువలు, బాటలు కూడా వేశారు. దీంతో రిజర్వాయర్ పంటలు సిరులు కురిపిస్తుండటంతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ రిజర్వాయర్ లో సుమారు నాలుగువేల ఎకరాలకు పైగా కబ్జాకు గురయింది. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి రిజర్వాయర్ లో ఆక్రమణలను నివారించాల్సిన అవసరం ఉంది.