TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రతిష్టాత్మకంగా మారిన కోవూరు ఉప పోరు

Published on: Sat Feb 25, 2012 3:32PM

నెల్లూరుజిల్లా: నెల్లూరుజిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఎన్నికలను టిడిపి జిల్లా అధ్యక్షుడు, అభ్యర్ధి అయిన సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మంత్రి అయిన ఆనం సోదరులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాయకుడు, ఎంపి అయిన మేకపాటి రాజమోహనరెడ్డికి సవాలుగా నిలిచాయి. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా గెలవాలని ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ప్రత్యర్ధుల వ్యూహాలను పసిగట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు మండలాల వారీగా బాధ్యతలు తీసుకుని ముమ్మరంగా పర్యటన జరుపుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహనరెడ్డి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లా నేతలతోపాటు  సీమాంధ్రలోని ప్రముఖ నేతలకు కూడా ఆయన ఎన్నికల బాధ్యతలు అప్పగించారు.