TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నెల్లూరు జిల్లాలో జోరుగా భూముల రిజిస్ట్రేషన్లు

Published on: Mon Feb 20, 2012 3:04PM

రిజిస్ట్రేషన్ శాఖకు రూ.110 కోట్లు ఆదాయం
నెల్లూరు జిల్లా:   నెల్లూరు జిల్లాలో భూ క్రయ విక్రయాలు అమాంతం పెరిగాయి. ప్రభుత్వం ఖజానాకు లక్ష్యానికి మించి రాబడి చేకూరింది.2011-12లో జనవరి నాటికి లక్ష్యం రూ. 67 కోట్లు కాగా రాబడి రూ.113 కోట్ల వరకు వచ్చింది. నెల్లూరు ఆర్ ఓ పరిధిలో 9 సబ్ రిజిస్ట్రార్  కార్యాలయాలు, గూడూరు ఆర్ ఓ పరిధిలో 10 సబ్ రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ ఆదాయం సమకూరింది. గూడూరు, సూళ్ళూరుపేట, చిల్లకూరు, ముత్తుకూరు తదితర ప్రాంతాలు పారిశ్రామికంగా  ముందుకెళుతున్నాయి. దాంతో అక్కడ స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. రాబడిలో మొదటి స్థానంలో ముత్తుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిలిచింది.