TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆనం సోదరులకు లిక్కర్ సిండికేట్ ముడుపులు?

Published on: Mon Feb 20, 2012 9:29AM

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఆనం సోదరులది ఆడిందే ఆట, పాడిందే పాట. జిల్లాలో ఏ కార్యక్రమం జరిగిన వీరి కనుసన్నల్లోనే జరగాలి. ఈ సోదరులు నెల్లూరు కార్పోరేషన్ ను భ్రష్టు పట్టించారని అవినీతి కారణంగా అది దివాలా తీసే స్థాయికి చేరుకుందనే విమర్శలను ప్రత్యర్ధులు వినిపిస్తున్నారు. అంతేకాక ఆనం సోదరులకు మద్యం సిండికేట్ నుంచి కోట్లాది రూపాయల ముడుపులు అందాయని, ఈ వివరాలు తమ వద్ద ఉన్నాయని టిడిపి నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆనం సోదరులకు ఇటీవల శుభా కాంక్షలు తెలుపుతూ లిక్కర్ వ్యాపారులు లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి టీవీలు, వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇచ్చారని ఆయన చెబుతున్నారు. మద్యం వ్యాపారులతో వీరికిగల సంబంధాలకు ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలని ఆయన ప్రశ్నిస్తున్నారు.