TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీ గూటికి చేరనున్న ఆనం

Published on: Mon Jun 4, 2018 4:10PM

 

నెల్లూరు రాజకీయాల గురించి ఎప్పుడు మాట్లాడిన ఆనం బ్రదర్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే.. నెల్లూరులో ఒక వెలుగు వెలిగిన వీళ్ళు.. తెలుగు ప్రజలకి బాగా సుపరిచితులు.. ఆనం బ్రదర్స్ ఏ పార్టీలో ఉన్నా నెల్లూరు ప్రజలు ఆదరించారు.. గత కొంతకాలంగా ఆనం బ్రదర్స్ టీడీపీ లో ఉన్నారు.. అనుకోకుండా ఆనం వివేకానంద రెడ్డి అనారోగ్యంతో మృతి చెందటం.. ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ తో అసంతృప్తిగా ఉండటం.. ఇవన్నీ రామ నారాయణరెడ్డి పార్టీ మారాలన్న ఆలోచనకి పునాది వేసినట్టున్నాయి.. అందుకే ఆయన త్వరలో టీడీపీని వదిలి వైసీపీ గూటికి చేరుతున్నట్టు వార్తలొస్తున్నాయి.. ఇదే జరిగితే నెల్లూరులో టీడీపీకి నష్టమే.. చూద్దాం ఏం జరుగుతుందో...