TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నెల్లూరులో వైభవంగా ప్రారంభమైన రొట్టెల పండుగ

Published on: Sun Jul 6, 2025 3:16PM

 

నెల్లూరులోని ప్రసిద్ద బారాషషీద్ దుర్గ వద్ద రొట్టెల పండుగ ఇవాళ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం జరిగే ఈ పండుగ ఐదు రోజుల పాటు జరిగే పాటు జరగనున్నది. తమ కోరికలు నెరవేరాలని ఆశిస్తూ భక్తులు స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకునే ఈ విశిష్టమైన ఉత్సవంలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో దర్గా ప్రాంగణం, స్వర్ణాల చెరువు పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. 

తమ అనుకున్న కోరికలు తీరాలని ఆశిస్తూ, గతంలో కోరిక తీరిన వారి నుంచి రొట్టెను స్వీకరించడం, తమ కోరిక తీరితే ఇతరులకు రొట్టెను ఇవ్వడం ఈ పండుగలోని ప్రధాన ఆచారం. దీని కోసం భక్తులు స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు ఆచరించి, భక్తిశ్రద్ధలతో రొట్టెలను మార్చుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రాంగణంలో ప్రత్యేక టెంట్లు, తాగునీటి సౌకర్యం, ఉచిత భోజన వసతి కల్పించింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఉన్నతాధికారులు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, పండుగ ప్రశాంతంగా జరిగేలా పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రాకతో దర్గా పరిసర ప్రాంతాల్లో పూర్తి పండుగ వాతావరణం నెలకొంది.