TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ స్వార్థం వల్లే ఉపఎన్నికలు ఆనం

Published on: Sat Dec 17, 2011 4:06PM

నెల్లూరు: జగన్ స్వార్థం వల్లనే ఉపఎన్నికలు వస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. తమపై వైయస్ జగన్ చేసే ప్రతి విమర్శ కూడా దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికే తగులుతుందని  ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయి వైయస్ జగన్‌కు లేదని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని పాలించాలని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వైయస్ రాజశేఖర రెడ్డికి అవకాశం ఇచ్చారని ఆయన అన్నారు. వైయస్ హయాంలో పేరుకుపోయిన ఫీజు బాకీలు కిరణ్ కుమార్ రెడ్డి విడుదల చేశారని ఆయన చెప్పారు. రైతులపై ప్రేమ ఉన్నట్లు వైయస్ జగన్ నటిస్తున్నారని ఆయన విమర్శించారు.  ఓదార్పు పేరుతో జగన్ స్వార్థ రాజకీయ యాత్ర చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టను మంట గలుపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా, ఆనం సోదరులు రామనారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డిలపై వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి ధ్వజమెత్తారు. వీర ప్రగల్భాలు పలుకుతున్న ఆనం సోదరులు ఉదయగిరిలో కాంగ్రెసు అభ్యర్థిని పెట్టాలని ఆయన సవాల్ చేశారు.