TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఐరన్ లెగ్ ప్రసన్నకుమార్ రెడ్డి

Published on: Sat Feb 18, 2012 4:04PM

నెల్లూరుజిల్లా: నెల్లూరుజిల్లాలోని ప్రముఖ నేతల్లో కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఒకరు. ఈయన నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి  కుమారుడు. ప్రస్తుతం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈయనను ప్రత్యర్ధులు ఐరన్ లెగ్ పొలిటిషియన్ గా తరచూ విమర్శిస్తున్నారు. ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చిన ప్రసన్నకుమార్ అనంతరం తెలుగుదేశంపార్టీకి వెన్నుపోటు పొడిచారన్న అపవాదు ఉంది. తన స్వలాభంకోసం వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆశ్రయించి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన అకాల మరణం  పాలయ్యారని, తదనంతరం జగన్ పార్టీలో చేరగానే జగన్ ను కేసులు చుట్టుముట్టాయని ప్రత్యర్ధులు ప్రచారం చేస్తున్నారు. రానున్న ఉపఎన్నికల్లో ప్రసన్నను గెలిపిస్తే కొవ్వూరు నియోజకవర్గం అధోగతికాక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.