TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జోరుగా బాబు రైతు పోరుయాత్ర..సర్కారుపై ఫైర్‌

Published on: Mon Feb 6, 2012 3:03PM

హైదరాబాద్: నెల్లూరు జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రైతుపోరుయాత్ర  జోరుగా సాగుతోంది. రైతు ఎజెండాను జాతీయ ఎజెండాగా రూపొందించాలని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యత పెరగాలన్నారు. యూత్ కు ప్రాధాన్యం కల్పించలేని పార్టీలు మనుగడ సాగించే పరిస్థితిలో లేవని బాబు అన్నారు.