TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సూప‌ర్  చోప్రా .. 19 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ భార‌త్ కు  ర‌జ‌తం

Published on: Sun Jul 24, 2022 9:59AM

భార‌త అథ్లెట్ నీర‌జ్ చోప్రా మ‌రోసారి దేశానికి మ‌రో చ‌రిత్రాత్మ‌క విజ‌యాన్ని అందించాడు. అమెరికా ఒరెగాన్‌లో జ‌రుగుతున్న ప్ర‌ప‌పంచ ఛాంపియ‌న్‌షిప్‌లో ఒలింపిక్ ఛాంపియ‌న్ చోప్రా 88.13 మీట‌ర్లు జావెలిన్ విసిరి ర‌జ‌త ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకున్నా డు. ఆదివారం ఉద‌యం జ‌రిగిన పైనల్స్‌లో నాలుగో ప్ర‌య‌త్నంలో ఈ ఫీట్ సాధించాడు. కాగా అమెరికాలోని ఒరెగాన్‌లో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా మరో చారిత్రాత్మక అధ్యా యాన్ని లిఖించాడు. కాగా ఈ విభాగంలో డిఫెండింగ్​ ఛాంపియన్​, గ్రెనెడాకు చెందిన అండర్సన్​ పీటర్స్​ మరోసారి విజేతగా నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడు. పీటర్స్​ తన తొలి ప్రయ త్నంలోనే 90.46 మీటర్ల దూరం జావెలిన్ విసిరి స్వ‌ర్ణ‌ప‌త‌కం గెలుచుకున్నాడు. 

2003లో అథ్లెటిక్స్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో లాంగ్ జంప్ లో కాంస్య పతాకాన్ని అంజు బాబీ జార్జ్ గెలుచుకున్న ఏకైక భారతీయురాలిగా నిలిచింది. 2022లో నీరజ్ మళ్ళీ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పతాకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతాకాన్ని అందుకున్న నీరజ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్ త్రో ఫైనల్లో 12మందితో తలప డ్డాడు. 

మరో భారతీయ క్రీడాకారుడు రోహిత్ యాదవ్ కూడా ఫైనల్ లో పతకం కోసం పోటీపడ్డాడు.  ప్రపంచ ఛాంపియన్ షిప్ లో ఒకే ఎడిషన్ లో ఇద్దరు భారతీయ క్రీడాకారులు అదీ జావెలిన్ త్రో లో ఫైనల్ రౌండ్ కు చేరుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి. క్వాలిఫై యింగ్ రౌండ్ లో  80.42 మీటర్ల త్రో విసిరి.. రోహిత్ యాదవ్  11వ స్థానంలో నిలిచి ఫైనల్‌లో చోటు దక్కించుకున్నాడు. దీంతో భారత్‌కు రెట్టింపు ఆనందం దక్కింది.  అయితే జావెలిన్ త్రో ఫైనల్లో రోహిత్ యాదవ్ అత్యుత్తమ 78.72 మీటర్లతో 10వ స్థానంలో నిలిచాడు.