TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మరికాసేపట్లో రైల్వే బడ్జెట్

Published on: Tue Jul 8, 2014 10:58AM

 

కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ రైల్ భవన్ కు చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో ఆయన పార్లమెంట్ లో రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతకు రైల్వే అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. రైల్వే బడ్జెట్ లో ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారిస్తారని తెలుస్తోంది. మరోవైపు ఈసారి బడ్జెట్ లో రైల్వేల ఆదునీకరణ, రైళ్ళలో కొత్త సౌకర్యాలు కల్పన, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. నిన్న భారతీయ రైల్వే ఫేస్ బుక్, ట్విట్టర్ లో తమ ఖాతాలు కూడా ఓపెన్ చేశారు.