యశ్వంత్ సిన్హా నామినేషన్ 27న.. హాజరు కానున్న కేటీఆర్
Published on: Mon Jun 27, 2022 6:25AM
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన సోమవారం ఉదయం 11.30 గంటలకు తన నామానేషన్ దాఖలు చేస్తారు. యశ్వంత్ అభ్యర్థిత్వానికి ఇప్పటికే టీఆర్ఎస్ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి టీఆర్ ఎస్ తరఫున పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేటీఆర్ ఆదివారం రాత్రే హస్తినకు బయలు దేరి వెళ్లారు. కేటీఆర్ వెంట ఎంపీలు నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, సురేశ్ రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేశ్ నేత, ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.
కాగా ఎన్‌డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. రాష్ట్రపతి ఎన్నిక జులై 18న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు అదే నెల 21న ఉంటుంది. కాగా రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల దాఖలుకు ఈ నెల 29 తుదిగడువు. కాగా ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24తో ముగియనుంది.


