TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము

Published on: Wed Jun 22, 2022 5:49AM

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము పేరు ఖరారైంది. న్యూఢిల్లీలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆధ్వ‌ర్యంలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 20 పేర్లపై చర్చించి చివరకు ముర్ము పేరును ఖరారు చేశారు. ఒడిశా మయూర్‌బంజ్ జిల్లాలో జన్మిం చిన ముర్ము గతంలో జార్ఖండ్ గవర్నర్‌గా ఐదేళ్లు పనిచేశారు. 

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా తూర్పు ప్రాంతానికి చెందిన గిరిజన మహిళ ఉంటే బావుంటుందని భావించామని బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం అనంతరం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ఈ స‌మావేశంలో జె.పి.న‌డ్డా, రాజ్‌నాథ్ సింగ్‌, అమిత్ షా, నితిన్ గ‌డ్కారీ త‌దిత‌ర బిజెపి నాయ‌కులు పాల్గొన్నారు.

అంతకు ముందు మంగళవారం మధ్యాహ్నం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి నివాసానికి హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెళ్లి ఆయనతో భేటీ కావడంతో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడిని ఖరారు చేసే అవకాశాలున్నాయంటూ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

సాయంత్రం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా దౌపది ముర్ము పేరును ఖరారు చేసినట్లు నడ్డా ప్రకటించారు.  ద్రౌపది ముర్ము విశేష ప్రతిభాశాలి అని, వివాదరహితురాలని చెప్పారు.జార్ఖండ్  ద్రౌపది ముర్ము 2000 లో రాయ్‌రంగాపూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఒడిషా బీజేపీ ఎస్సీ శాఖ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఒడిషా రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు.