TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నాయిని సంచలన వ్యాఖ్యలు.. ఆంధ్రా దొరలను తరిమేశాం

Published on: Tue Jan 26, 2016 1:39PM

తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఆంధ్రా వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నాడు తెల్ల దొరలను దేశం నుండి తరిమి మన పోరాటయోధులు స్వాతంత్ర్యం తీసుకొచ్చారని.. అలాగే తాము కూడా ఆంధ్రా దొరలను తెలంగాణ నుంచి తరిమేశామని అన్నారు. మరోవైపు గ్రేటర్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సెటిలర్ల విషయమై ఆచితూచి మాట్లాడుతూ.. వారిని కాకా పడుతుంటే ఇప్పుడు నాయిని ఇలా వ్యాఖ్యానిస్తున్నారు. మరి నాయిని వ్యాఖ్యలని సెటిలర్లు పట్టించుకుంటారో లేదో చూడాలి.