TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

'నాయక్' సక్సెస్ టూర్: బాబ్జీకి వినాయక్ క్షమాపణ

Published on: Sun Jan 20, 2013 12:38PM

 

 

Nayak team's success tour, Ram Charan Nayak Success, vinayak ram charan

 

 

రామ్‌చరణ్ 'నాయక్' మూవీలో విలన్ పాత్ర పేరుపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో విలన్ రాహుల్‌దేవ్ పాత్రకు 'గండి బాబ్జీ' అని పేరు పెట్టడంపై మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. "నాయక్" సక్సెస్ టూర్ లో వైజాగ్ వెళ్ళిన వినాయక్ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నాయకుడు గండి బాబ్జి కి క్షమాపణ చెప్పారు.


"సిటికి గండి పేట్ నీళ్ళు ఎంత ఫేమాస్సో..గండి బాబ్జీ పేరు కూడా అంతే ఫేమాస్ అన్న డైలాగ్ కి సేట్ అవుతుందని ఆ పేరు పెట్టామే తప్ప ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, గండి బాబ్జి మనస్తాపం చెందితే క్షమించాలని వినాయక్ అన్నారు. ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు వుంటే తొలగిస్తామని హామీ ఇచ్చారు. నాయక్ సినిమాలో 'గండి బాబ్జీ' పేరు పై వివాదం సృష్టించడంతో ఆయనకి మంచి ప్రచారం దొరికింది.