1210 ధియేటర్లలో "నాయక్" గ్రాండ్ రిలీజ్
Published on: Tue Jan 8, 2013 3:14PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ "నాయక్" రేపు రిలీజ్ కానుంది. ప్రపంచ వ్యాప్తంగా 1210 ధియేటర్లలో, ఓవర్సీస్ లో 140 ధియేటర్ లలో గ్రాండ్ గా విడుదల చేస్తున్నామని డైరెక్టర్ వినాయక్ చెప్పారు. ‘సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. తమన్ అందించిన సంగీతం మా సినిమాకు తొలి సక్సెస్. ఇప్పటికే సినిమాను చూసిన ప్రముఖులు అద్భుతంగా వచ్చిందని మెచ్చుకున్నారు. సినిమాల్లో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయి. ముఖ్యంగా బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డిల కామెడీ బాగా నవ్విస్తుంది. ఆకుల శివ కథ, మాటలు సినిమాకు మరో హైలెట్. నాయక్ సినిమా చరణ్ తో చేస్తున్నంత చేసే చిరంజీవితో చేసినట్లే అనిపించింది. సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు.


