నేను అలా అనలేదు..

 

రాజకీయ నేతలు నోరు జారడం.. ఆ తరువాత మేము అలా అనలేదని మాట మార్చడం కామన్ థింగే. ఇప్పుడు పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా అలానే చేశారు. ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 26/11 ముంబై దాడులు చేసింది తమ దేశమేనని నవాజ్ షరీఫ్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక దీనిపై పెద్ద రచ్చే జరిగింది. దీంతో ఈ వార్తలపై స్పందించిన నవాజ్ షరీఫ్ అంతలోనే మాట మార్చారు. తాను అలా అనలేదని, మీడియా తన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించింది అంటూ ఆయన వివరణ ఇచ్చారు.

 

షరీఫ్‌ అధికార ప్రతినిధి ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘నవాజ్‌ షరీఫ్‌ ప్రకటనను భారత మీడియా పూర్తిగా తప్పుగా వ్యాఖ్యానిస్తూ ప్రచురించింది. దురదృష్టవశాత్తు పాకిస్థాన్‌లోని ఓ సెక్షన్‌ మీడియా, సోషల్‌ మీడియా కూడా భారత మీడియా చేసిన దురుద్దేశపూరిత ప్రచారాన్ని నమ్మి.. అదే నిజమైనట్టు ప్రచారం చేశారు. ఆయన ప్రకటనలోని నిజానిజాలు పట్టించుకోలేదు. పాక్‌ జాతీయ భద్రత విషయంలో దేశ అత్యున్నత రాజకీయ పార్టీ అయిన పీఎంఎల్‌ఎన్‌కుగానీ, ఆ పార్టీ అధినేత షరీఫ్‌కుగానీ ఎవరి సర్టిఫికెట్‌ అవసరం లేదు’’ అని అన్నారు.