TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

సిద్దూకి గ్రీన్ సిగ్నల్.. టీవీ షోలు చేసుకోవచ్చు..

Published on: Fri Mar 24, 2017 11:19AM

 

తాను మంత్రిగా ఉన్నా.. టీవీ షోలు మాత్రం కంటిన్యూ చేస్తానని పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ చెప్పిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను ఆయనపై ప్రతిపక్ష నేతలు పలు విమర్శలు కూడా గుప్పించారు. అయితే ఇప్పుడు టీవీ షోలు చేసేందుకు గాను అనుమతి లభించింది. మంత్రిగా కొనసాగుతూ టీవీ షోలు చేసుకోవడానికి అభ్యంతరం లేదని.. అతుల్ నందా నుంచి తనకు నివేదిక అందిన విషయాన్ని ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ధ్రువీకరించారు. అడ్వకేట్ జనరల్ పచ్చజెండా ఊపడంతో మంత్రిగా కొనసాగేందుకు సిద్ధూకు అడ్డంకులు తొలగిపోయాయి. ఆయన శాఖను కూడా మార్చే అవకాశం లేదు.