TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

నేను చేసుకుంటే మీకెందుకు కడుపు మంట...

Published on: Wed Mar 22, 2017 12:51PM

 

పంజాబ్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిసున్నప్పటికీ నవజ్యోత్‌ సింగ్ సిద్ధూ టీవీ షోల్లో పాల్గొంటానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఆయనకు కొంత మంది సపోర్ట్ చేసినా కొంత మంది విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు అయితే  ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత టీవీ షోలలో పాల్గొనడం ఏమిటని మండిపడుతున్నారు. మరి దీనికి సిద్దూ సైలెంట్ గా ఉంటాడా.. తనదైన శైలిలో వారికి ఘాటుగానే సమాధానం చెప్పాడు.  ‘మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ తరహాలో నేనే ఏమైనా బస్సు సర్వీసులను నడిపానా? లేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డానా? కేవలం నెలలో నాలుగు రోజులు.. అది కూడా రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పనిచేసుకుంటానంటే.. ఎందుకు మీకు కడుపు మండిపోతున్నది’ అని సిద్ధూ ప్రశ్నించారు. సిద్ధూ  ప్రస్తుతం ప్రముఖ రియాలిటీ షో ‘కపిల్ శర్మ కామెడీ నైట్స్’కు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.