TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కేజ్రీవాల్ అహంకారం ఓడింది..

Published on: Sat Mar 11, 2017 11:57AM

 

పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆప్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించినందుకు ప్రజలకు కోటి కోటి ధన్యవాదాలు తెలుపుతున్నామని.. ప్రజల రుణం తీర్చుకోలేమని అన్నారు. పంజాబ్‌లో అహంకారం ఓడింది.. ధర్మం గెలిచిందని... దెబ్బతిన్న పంజాబ్‌ను మళ్లీ పట్టాలెక్కిద్దామన్నారు. పంజాబ్‌ను దేశానికి ఉదాహరణగా మార్చాలని అనుకుంటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కేజ్రీవాల్ పై విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్ ప్రచారంలో నిజాయితీ లేదు...అందుకే ఓటమి పాలయ్యారు. సోషల్ మీడియాలో కేజ్రీవాల్ ప్రచారానికి పంజాబ్ ప్రజలు సరైన బుద్ధి చెప్పారని తెలిపారు. దుష్టులను ఎప్పటికైనా భగవంతుడు శిక్షిస్తాడు అని అన్నారు.