సిద్దూకి కాంగ్రెస్ కరెక్ట్ కాదు..

 

మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ నవజ్యోత్ సింగ్ సిద్దూ బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజీనామా చేయడానికి చేశారు కాని.. ఆ తరువాత ఆయన ఏ పార్టీలోకి చేరుతారు అన్న దానిపై ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు. అయితే సిద్దూ రాజీనామా చేసిన తరువాత ఆయన ఆప్ పార్టీలోకి వెళతారు అన్న వార్తలు జోరుగా వినిపించాయి. అయితే ఆ వార్తలకు బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ.. ఆప్ పార్టీ ఈ రెండింటిలో దేనిలో చేరుతారన్న అనుమానం వ్యక్తమవుతుంది. అయితే ఇప్పుడు ఈ అనుమానాలకు సిద్దూ భార్య నవజ్యోత్ కౌర్ తెరదించింది. తన భర్త కాంగ్రెస్ పార్టీలో ఇమడలేరని, ఆ పార్టీ సరైన గమ్యస్థానమని తాను భావించడం లేదని ఆమె వ్యాఖ్యానించారు.

 

మరోవైపు సిద్దూ పెట్టిన డిమాండ్లకు కేజ్రీవాల్ ఒప్పుకోకపోవడంతో సిద్దూ ఎంట్రీ ఆలస్యమైందన్న వార్తలు వినిపిస్తున్నాయి. తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా, తన భార్యకు ఎమ్మెల్యేగా టికెట్లు ఇవ్వాలని సిద్దూ కోరగా..ఒకే ఇంట ఇద్దరికి టికెట్లు ఇవ్వలేమని ఆప్ అధినేత తేల్చి చెప్పడమే సిద్ధూ ఆప్ లో చేరికకు ప్రధాన అడ్డంకిగా మారినట్టు తెలుస్తోంది. మరి కేజ్రీవాల్ ఎప్పుడు ఒప్పుకుంటారో.. సిద్దూ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.