మన్మోహన్‌ని ఏకిపారేసిన నట్వర్ సింగ్
Published on: Sat Aug 2, 2014 10:07AM

మాజీ మంత్రి నట్వర్ సింగ్ ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్’ పేరిట రాసిన తన ఆత్మకథలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ని ఏకిపారేశారు. మన్మోహన్ మీద నట్వర్ సింగ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇలా వున్నాయి.
1. పదేళ్ళపాటు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ దేశానికి చేసిందేమీ లేదు.
2. మన్మోహన్ సింగ్ ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా మరచిపోరు. అయితే తన మనసులో వున్న విషయాలు ముఖంలో కనిపించకుండా చాలా జాగ్రత్త పడతారు.
3. మన్మోహన్ సింగ్ హయాంలో భారత విదేశాంగ విధానం కూడా దెబ్బతిన్నది. మన్మోహన్ హయాంలో జపాన్‌తో మన దేశ సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి.
4. మన్మోహన్ హయాంలో అమెరికా విషయంలో ఇండియా మెతక వైఖరిని అవలంబించింది.


