పీవీ అంటే సోనియాకి మంట!
Published on: Sat Aug 2, 2014 9:52AM

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అంటే సోనియాగాంధీకి ఎంతమాత్రం పడేది కాదని కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ తన ఆత్మకథ ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్’లో పేర్కొన్నారు. ‘‘పీవీ నరసింహారావును సోనియాగాంధీయే ప్రధానమంత్రిని చేశారు. కానీ ఆయనంటే ఆమెకి అసలు గిట్టేది కాదు. పాపం పీవీయేమో ఆమె నన్ను ఎందుకు ఇలా శత్రువులాగా చూస్తోందని వాపోతూ వుండేవారు. నాక్కూడా మొదట్లో పీవీ అంటే పడేది కాదు. అందుకే నేను కాంగ్రెస్ నుంచి బయటకి వచ్చేశాను. అయితే ఆ తర్వాత మా ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. పీవీతో సంబంధాలు మెరుగయ్యాక 1994లో ఒకసారి ఆయన ఇంటికి నన్ను రమ్మన్నారు. నేను వెళ్ళాను. అప్పుడు పీవీ చాలా ఆందోళనగా వున్నారు. ‘సోనియా నన్ను ఒక శత్రువులా చూస్తున్నారు. కారణం ఆమె సలహాదారులు కొంతమంది ఆమెకు నాగురించి లేనిపోనివి కల్పించి చెబుతున్నారు. అలాంటి వారిని నేను పట్టించుకోను. అయితే సోనియా నా పట్ల అనుసరిస్తున్న వైఖరితో నా ఆరోగ్యం దెబ్బతింటోంది. నేను ప్రధాని పదవిలో వుండటం సోనియాకి ఇష్టం లేకపోతే ఆమె ఆ విషయమేదో స్వయంగా చెబితే నేను హాయిగా నా పదవిని వదిలేస్తా కదా’’ అని పీవీ చెప్పారు అని నట్వర్ సింగ్ తన ఆత్మకథలో పేర్కొన్నారు.


