మనిషి మారకపోతే ప్రకృతి కలగజేసుకుంటుందా?

ఉప్పెనలు, భూకంపాలు, కార్చిచ్చులు, ఇవన్ని ఊరికే రావు. తినడానికైనా.. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. ఓ పద్దతి పాడు ఉంటుంది. అబార్షన్ లో బైటపడిన పిండాలను సైతం వ‌ద‌ల కుండా హోటల్లో సూప్ చేసి పెడితే.. ఎగబడే జనం... ఆరునెలల పసి గుడ్డు శవానికి , ఫుడ్డుగా ఆర్డరేసే జనం.  బ్రతికున్న పురుగులను స్టిక్స్ తో అలవోకగా పట్టి బిడ్డలకు బలవంతంగా తినిపించే జనం. ఛీ... ఇలా ఇష్టం వ‌చ్చిన‌ట్లు ఎవ‌రికి వారు రెచ్చిపోతుంటే...

ఎక్కడ ఏది బ్యాలన్స్ తప్పినా.... మనిషి మారకపోతే  ప్రకృతి ఇలాగే కలగజేసుకుంటుంది.  ఏదిఏమైనా లెక్క సరిజేయడంలో తన మనా ఉండదు. ఆ దేశం ఈ దేశం అని ఉండదు.. బంధువు, స్నేహితులు తేడాలేమీ లేవు. ప్ర‌కృతి త‌న‌కు తాను అప్డేడ్ చేసుకుంటుంది. 

మ‌నం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే ఏ విపత్తు ఊరికేరాదు.. అది మనిషి మేధస్సు కి అందలేదంటే , కచ్చితంగా అది మనిషి మంచి కోసం జరగడానికని అర్థం చేసుకోవాలి. ఉపద్రవాలని అనుకుంటాం అంతే.

ఎయిడ్స్ వ్యాది రాకపోయి ఉంటే పులిరాజాలు కంట్రోల్‌లో వుండేవారే కాదు.  కరోనా రాకపోయుంటే సిస్టమ్ ఇంతగా కంట్రోల్ అయేదికాదు..! 

ఇపుడు ఆకాశం నిర్మలంగా ఉంది. కాలుష్యం లేని గాలి ప్రపంచమంతా వీస్తుంది.  మనిషిని మనిషి తాకకుండా గౌరవించుకుంటున్నారు. కుటుంబాలు ఒకే చోట ఉండి ప్రేమలు పంచుకుంటున్నాయి. చచ్చినోళ్ళు చావగా, బ్రతికున్నవారు సిస్టమ్ కి అలవాటు ప‌డ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. కొన్ని వేల మూగజీవాలు ప్రాణాలతో బ్రతికిపోయాయి. ఇప్ప‌ట్టికైనా మ‌నమంతా మార‌క‌పోతే భూమి మీదు చోటు కాపాడుకోవ‌డం క‌ష్ట‌మేన‌ని క‌రోనా హెచ్చ‌రిస్తోంది.