ప్రధాని మోదీకి మంగళగిరి చేనేత కానుక..!
Published on: Fri Aug 7, 2026 2:49PM

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యా దపూర్వకంగా కలుసుకు న్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చేనేత రంగా నికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన మంగళగిరి చేనేత వస్త్రాన్ని ప్రధానమంత్రికి బహూకరించారు. రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్, సానా సతీష్, భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేష్ తదితరులు ప్రధానమంత్రిని కలిసి మంగళగిరి చేనేత వస్త్రాన్ని స్వయంగా అందజేశారు. మంగళగిరి చేనేతకు ఉన్న ప్రత్యేకత, దాని వెనుక ఉన్న నేత కార్మికుల శ్రమ, నైపుణ్యాన్ని ఈ సందర్భం గా వారు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ చేనేత సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే మంగళగిరి వస్త్రం ప్రధానమంత్రికి అందజేయడం ద్వారా రాష్ట్రంలోని చేనేత కళా కారుల ప్రతిభకు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించినట్ల యింది.
ముఖ్యంగా రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గా నికి చెందిన చేనేత వస్త్రం ప్రధానమంత్రికి కానుకగా అందడం ప్రాధాన్యత సంతరించుకుంది. తరతరాలుగా మంగళగిరి చేనేత కార్మికులు తమ నైపుణ్యం తో ప్రత్యేకమైన వస్త్రాలను రూపొందిస్తున్నారు. వారి శ్రమ, కళా నైపుణ్యానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం లో ఇటువంటి కార్యక్ర మాలు కీలకంగా నిలుస్తా యని నేతలు పేర్కొన్నారు. చేనేత రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందుతున్న ప్రోత్సాహం, కళాకారులకు అండగా నిలిచే విధానాలకు ఈ కార్యక్రమం ప్రతీకగా నిలిచిందని వారు తెలిపారు. మంగళగిరి చేనేత వస్త్రం ప్రధానమంత్రికి బహూకరించడంతో ఆంధ్రప్రదేశ్ చేనేత కళాకారుల ప్రతిభ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
National Handloom Day, PM MODI, Chinthakayala Vijay, Sana Satish, Bhashyam Ramakrishna, Lingamaneni Ramesh, Naralokesh, Mangalagiri Handloom, CM Chandrababu


