శశికళకు మరో షాక్.. నటరాజన్ కు జైలు శిక్ష....

 

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ ఇప్పటికే అక్రమాస్తుల కేసులో భాగంగా బెంగుళూరు పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు తాజాగా మరో షాక్ తగిలింది శశికళకు. ఆమె భర్త నటరాజన్ కు కూడా జైలు శిక్ష పడింది. అసలు సంగతేంటంటే... 1994లో లెక్సస్ కంపెనీకి చెందిన ఓ ఖరీదైన కారును బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకున్నారు నటరాజన్. ఈ కారును అతని బంధువు భాస్కరన్ కు పుట్టినరోజు బహుమతిగా ఇచ్చారు. కారుకు సంబంధించిన రూ. 1.62 కోట్ల సుంకాన్ని ఎగ్గొట్టేందుకు... ఆ కారును యూజ్డ్ కారుగా చూపించారు. 2010లో కేసుకు సంబంధించిన తుది తీర్పుపై స్టే విధించిన హైకోర్టు... ఈ రోజు శిక్షను ఖరారు చేసింది. దాదాపు 23 ఏళ్ల తరువాత తీర్పునిచ్చిన కోర్టు.. నటరాజన్ కు  రెండేళ్ల జైలు శిక్షను విధించింది.