TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నాజర్ కొడుక్కి యాక్సిడెంట్: పరిస్థితి విషమం

Published on: Thu May 22, 2014 2:58PM

 

తమిళ, తెలుగు, హిందీ భాషల్లో కేరెక్టర్ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న నాజర్ కుమారుడు ఫైజల్ చెన్నైలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఫైజల్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా వున్నట్టు తెలుస్తోంది. తలకు బలంగా గాయాలు తగలడంతో పరిస్థితి చెయ్యిదాటిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఫైజల్ చెట్టినాడులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఫైజల్ తన స్నేహితులతో కలసి కారులో చెన్నై నుంచి మహాబలిపురం వైపు వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. ఫైజల్ ఈ ప్రమాదం నుంచి కోలుకోవాలని కోరుకుంటూ తమిళనాడులోని అనేకమంది నటులు, నటీమణులు ట్విట్లు పోస్టు చేశారు. ఫైజల్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని మనమూ కోరుకుందాం.