గుజరాత్ మతఘర్షణల కేసులో దోషులకు శిక్షలు ఖరారు
Published on: Fri Aug 31, 2012 4:13PM
2002 లో గుజరాత్ లోని నరోడా పిటియా అల్లర్ల కేసులో దోషులకు ఆహ్మదాబాద్ ప్రత్యేక న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసింది. నరోడాపిటియా ఆల్లర్ల కేసులో ప్రథాన నిందితురాలైన మాజీమంత్రి మాయా కొడ్నానికి న్యాయస్థానం 18 సంవత్సరాల జైలు శిక్షని విధించింది. భజరంగ్ దళ్ నేత బాబూ భజరంగీకి జీవితఖైదుని విధించిన న్యాయస్థానం.. 29 మంది దోషులకు జీవితఖైదుని విధించింది.


