అమెరికా పర్యటనకు బయల్దేరిన మోడీ
Published on: Thu Sep 25, 2014 4:13PM
.jpg)
భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా బయల్దేరి వెళ్ళారు. నరేంద్ర మోడీ వెంట ఉన్నత అధికార బృందం కూడా బయల్దేరి వెళ్ళింది. మోడీ అమెరికాలో ఐదు రోజులపాటు పర్యటిస్తారు. ఒకప్పుడు మోడీకి వీసా ఇవ్వడానికే నిరాకరించిన అమెరికా ఇప్పుడు మోడీ ఘనస్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేసింది. రేపటి నుంచి 30 వరకు నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటిస్తారు. ఈనెల 29 లేదా 30వ తేదీన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మోడీ భేటీ అవుతారు. 27న జరిగే ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో నరేంద్ర మోడీ హిందీలో ప్రసంగిస్తారు. భారత్కి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం గురించి నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ప్రస్తావిస్తారు. ఈ పర్యటనలోనే ట్విన్ టవర్స్ కూల్చివేతలో మరణించిన వారికి మోడీ శ్రద్ధాంజలి ఘటించనున్నారు. అమెరికాలోని ఆరు ప్రధాన కంపెనీల సీఇఓలతో కూడా నరేంద్రమోడీ సమావేశమవుతారని సమాచారం.


