నేపాల్లో మోడీ ప్రచండం
Published on: Mon Aug 4, 2014 4:47PM

భారత ప్రధాని నరేంద్రమోడీ ఇప్పుడు నేపాల్ పర్యటనలో వున్నారు. నేపాల్లో ఆయనకు అఖండ స్వాగతం లభించింది. ఎక్కడకి వెళ్ళినా మోడికి బోలెడంత గౌరవం లభిస్తోంది. నేపాల్ దేశంలోని రోడ్ల అభివృద్ధికి మోడీ ఆరువేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేయడం కూడా నేపాల్లో ఆయనకు భారీగా అభిమానులను పెరిగేట్టు చేసింది. అధికారంలో వున్నవారు, రాజ కుటుంబానికి చెందినవారితోపాటు నేపాల్ మాజీ ప్రధాని, యునైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-మావోయిస్టు అధినేత పుష్ప కుమార్ అలియాస్ ప్రచండ కూడా మోడీ అంటే ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో మోడీతో ప్రచండ సమావేశమయ్యారు. ఇండో-నేపాల్ మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైందని ప్రచండ అన్నారు. నేపాల్ అభివృద్ధికి, శాంతికి చేయూతనిస్తున్న మోడీని ప్రచండ ప్రశసించారు.


