TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భయపడేవాళ్లే దేశంలో అత్యంత శక్తివంతమైనవాళ్లట..!

Published on: Fri Mar 30, 2018 5:24PM


2017-18 సంవత్సరానికి గానూ అత్యంత శక్తిమంతమైన వక్తి ఎవరో తెలుసా..? ఇంకెవరో కాదు...ప్రధాని మోడీ గారే. 2015-16, 2016-17 జాబితాలోనూ మోదీ తొలిస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.  ఈసారి కూడా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.  ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ 2017-18 సంవత్సరానికి గానూ అత్యంత శక్తిమంతమైన 100 మంది భారతీయుల జాబితాను తాజాగా విడుదల చేసింది. 100 పేర్లతో విడుదల చేసిన ఈ జాబితాలో ప్రధాని మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే.. ఆ వెంటనే రెండో స్థానం ఎవరిదో తెలుసా...? ఆయన కూడా మరెవరో కాదు.. మోడీ ప్రియ మిత్రుడు అమిత్ షా. ఆయన రెండో స్థానంలో ఉన్నారు. షా ఇలా రెండో స్థానంలో నిలవడం ఇది రెండోసారి.

 

మరి ఈ విషయం తెలిసినా నెటిజన్లు ఊరుకుంటారా..? అప్పుడే మోడీ, షా ద్వయంపై సోషల్ మీడియా సాక్షిగా సెటైర్లు వేసుకుంటున్నారు. పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై స్పందిస్తూ మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన నరేంద్ర మోడీ లోక్ సభలో సంపూర్ణ మెజారిటీ ఉన్నా ఒక సాధారణ అవిశ్వాస తీర్మానంకు బయపడి పారిపోతున్నారు అని అంటున్నారు. ఇంకా కొంతమందైతే.. దాదాపుగా 15 రోజులుగా సభ సజావుగా లేదు అనే వంకతో సభ వాయిదా వేయిస్తూ అవిశ్వాసాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అంటుంటే.. మరికొంత మంది మాత్రం... సొంత పార్టీ ఎంపీలే అవిశ్వాసం పెడితే తిరగబడతారేమో అని వారు భయపడుతున్నారు.. అటువంటప్పుడు వారు అత్యంత శక్తిమంతులు ఎలా అవుతారని కామెంట్లు విసురుతున్నారు. మరి కామెంట్ల సంగతి పక్కన పెడితే.. అందులో ఎంతో కొంత నిజం ఉందని చెప్పొచ్చు. అత్యంత శక్తివంతమైన మోడీ.. అవిశ్వాస తీర్మానానికి భయపడి.. దానిని చర్చకు రానివ్వకపోవడం నిజంగా హాస్యాస్పదం. మరి అలాంటివారు శక్తివంతులు ఎలా అవుతారో.. ఏమో..వారికే తెలియాలి..