సెలెబ్రిటీలతో భారీ స్కెచ్ వేసిన బీజేపీ
Published on: Fri Jun 8, 2018 4:20PM
.jpg)
రోజురోజుకి బీజేపీ మీద వ్యతిరేకత పెరుగుతుందని ప్రజలు అనుకుంటుంటే.. దానికి భిన్నంగా పలానా సెలబ్రిటీ బీజేపీలో చేరబోతున్నారంటూ రోజుకో వార్త బయటికొస్తుంది.. దీన్ని చూసి 'మనం అనుకున్నట్టు బీజేపీ మీద వ్యతిరేకత లేదు.. హీరోలు, హీరోయిన్లు, బిజినెస్ మేన్లు, క్రికెటర్లు అబ్బో ఇలా చాలామంది సెలెబ్రిటీల చేరికతో బీజేపీ ఇంకా బలపడుతుందని' అంతా అనుకుంటున్నారు.. కానీ ఇక్కడొక పెద్ద ట్విస్ట్ ఉంది.. ఇదంతా బీజేపీ స్కెచ్ అంట.. ప్రస్తుతం బీజేపీ, మోడీ నాలుగేళ్ళ పాలనలో సాధించిన విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 'సంపర్క్ ఫర్ సమర్థన్' అనే కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.. దీనిలో భాగంగానే బీజేపీ నేతలు సెలబ్రిటీలను కలిసి, వారి చేతికి మోడీ సాధించిన విజయాల బుక్లెట్ ను ఇస్తూ.. ఫోటోలకు ఫోజులిస్తున్నారు.. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో బీజేపీలో సెలబ్రిటీ చేరిక అంటూ రోజుకో వార్త పుట్టుకొస్తుంది.. మాధురి దీక్షిత్, రతన్ టాటా , వరలక్ష్మిలు బీజేపీలో చేరుతున్నారంటూ వచ్చిన వార్తలు కూడా అలా పుట్టుకొచ్చినవే.. సెలబ్రిటీలతో ఫోటోలు దిగి ఫ్యాన్స్ ని అట్ట్రాక్ట్ చేయడానికి బీజేపీ భలే స్కెచ్ కదా అని విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారట...


