మోడిని అరెస్ట్ చేయండి

 

భావి ప్రదానిగా బిజెపి చెపుతున్న నరేంద్రమోడి కి ఎంత సపోర్ట్ వస్తుందో అదే స్థాయిలో వ్యతిరేకత కూడా వస్తుంది. గుజరాత్ కు చెందిన స్వచంద సంస్థ జ‌న సంఘ‌ర్ష మోర్చ న‌రేంద్రమోడిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేసింది. అంతేకాదు గుజ‌రాత్‌లో రాష్ట్రప‌తిపాల‌న విదించాలంటూ కోరింది.

బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్ల కేసులో జైల్లో ఉన్న వివాదాస్పద ఐఎఎస్ అధికారి డీజి వంజారా మోడి త‌న‌ను అక్రమంగా ఈ కేసులు ఇరికించారంటూ లేఖ రాసిన నేప‌థ్యంలొ జ‌న సంఘ‌ర్ష మోర్చా ఈ డిమాండ్ చేసింది. అంతేకాదు లేఖ‌లో వంజారా తాను బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్లకు పాల్పడిన‌ట్టుగా పేర్కొన‌టంతో మోడి ప్రభుత్వం వెంట‌నే అసెంబ్లీ ర‌ద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు.

మంగ‌ళ‌వారం రాజీనామా చేసిన వంజారా అహ్మదాబాద్‌లోని స‌బ‌ర్మతీ కేంద్ర కారాగారంలో ఉన్న వంజారా ఈ మేర‌కు 10 పేజీల రాజీనామ లేఖ‌ను హోంశాఖ‌కు పంపారు.. ఈ లేఖ‌లో త‌న‌తో పాటు బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్లకు పాల్పడ్డ అధికారులంద‌రూ ప్రభుత్వ విధానాల‌నే పాటించార‌ని వారే త‌ప్పు చేయ‌లేద‌ని తేల్చిచెప్పారు. దీంతో ఇప్పుడు గుజారాత్ మోడి ప్రభుత్వం ఇబ్బందులో ప‌డింది.