మోడీ స్టేట్‌మెంట్స్‌పై బిజెపిలో దుమారం

 

 Narendra Modi, Narendra modi controversy, Narendra Modi New controversy

 

 

గోద్రా అల్లర్లపై మోడీ చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారం రుపుతూనే ఉన్నాయి.. మోడీ వ్యాఖ్యలను సమర్థించినందుకు బీఎస్పీ ఎంపీపై ఆ పార్టీ వేటు వేసింది. గోద్రా అల్లర్లకు సంబంధించి మోడీ చేసిన కుక్కపిల్ల వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశం లేదని... కావాలనే ఆయన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని బీఎస్పీకి చెందిన ఎంపీ విజయ్‌ బహదూర్‌సింగ్‌ మీడియాకు తెలిపారు.


అయితే తన ప్రత్యర్ధికి సపోర్ట్‌ చేయటం పై మాయావతి తీవ్రంగా స్పందించింది.. విజయ్‌ కామెంట్‌లను ఆమే తీవ్రంగా పరిగణించింది. అంతేకాదు మరెవరు అలాంటి స్టేట్‌మెంట్స్‌ ఇవ్వకుండా విజయ్‌ బహుదూర్‌ సింగ్‌ను  పార్టీ నుంచే సస్పెండ్‌ చేసేసింది. ఆయన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంభందం లేదని బహిరంగ ప్రకటన విడుదల చేసింది.


మొదదటి నుంచి బీఎస్పీ మొదటి నుంచి మోడీని వ్యతిరేకిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో మోడీని సమర్థిస్తే పార్టీ ఇమేజ్‌ దెబ్బతింటుందని భావించిన మాయావతి.. ఎలాంటి వివరణ తీసుకోకుండానే ఎంపీ విజయ్‌ బహదూర్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు.

ఇదిలా ఉంటే మోడికి సొంతం పార్టీ నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది.. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా ఢిల్లీ బిజెపి ఉపాధ్యక్షుడు ఆమీర్‌ రాజా హుస్సేన్‌ పార్టీకి రాజీనామా చేశారు.. పైగా 2002 గోద్రా అల్లర్ల పాపం నుంచి మోడీ తప్పించుకోలేరని విమర్శించారు.