విజయవాడలో నారాయణ స్కూల్ సీజ్

 

వేసవి సెలవుల అనంతరం తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే తిరిగి ప్రారంభమైన రోజే నారాయణ విద్యాసంస్థకు షాక్ తగిలింది. విజయవాడలోని సత్యనారాయణపురంలో సరైన అనుమతులు లేకుండా నడుస్తున్న నారాయణ స్కూల్ ను విద్యాశాఖ అధికారులు ఈ ఉదయం సీజ్ చేశారు. గుర్తింపులేని స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో అధికారులు ఈ స్కూల్ ను సీజ్ చేశారు. గతంలో స్కూల్ యాజమాన్యానికి మూడు దఫాలు నోటీసులు ఇచ్చామని, అయినా, వారి వైఖరి మారకపోవడంతో సీజ్‌ చేయడంతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించామని అధికారులు తెలిపారు.