రావత్ స్థానంలో నరవణె.. CoSC ఛైర్మన్‌గా నియామకం..
Published on: Thu Dec 16, 2021 11:02AM
చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ (CoSC) కమిటీ ఛైర్మన్‌గా ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ఆకస్మిక మరణంతో ఆ స్థానంలో నరవణెను నియమించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ అధిపతుల్లో నరవణెనే సీనియర్ కావడంతో ఆయనకు చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ బాధ్యతలు అప్పగించారు.
సీవోఎస్‌సీ కమిటీ సమావేశమై రావత్ దంపతులకు నివాళులలు అర్పించింది. ఆ తర్వాత జనరల్ నరవణె కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయితే.. రావత్ మరణం తర్వాత కొత్త సీడీఎస్ ఎవరనే దానిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తదుపరి సీడీఎస్‌గా జనరల్ నరవణె పేరే ప్రధానంగా వినిపిస్తోంది. సీనియార్టీ పరంగా ఆయననే ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
జనరల్ నరవణె.. 2019 డిసెంబరు 31న ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి ఛైర్మన్ అయ్యారు. ఇక, త్వరలోనే సీడీఎస్ కూడా అవుతారని అంటున్నారు.


