నరసరావు పేట పోలీసుల అదుపులో పోసాని
Published on: Mon Mar 3, 2025 8:56AM
.webp)
సినీ నటుడు పోసాని కృష్ణమురళి కి నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణ మురిళిని పీటీ వారంట్ తో నరసరావు పేట పోలీసులు అదుపులోనికి తీసుకుని నరసరావు పేటకు తరలించారు.
రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణ మురళిపై 17 కేసులు ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, నారా లోకేష్ లను, వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పోసానిపై ఈ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే పోసాని అరెస్టై రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.


