ప్రభుత్వ లాంఛనాలతో నారా రామ్మూర్తి అంత్యక్రియలు
Published on: Sun Nov 17, 2024 2:59PM
ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు ఆదివారం నారావారిపల్లిలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. తల్లిదండ్రుల సమాధుల పక్కనే రామ్మూర్తి అంత్యక్రియలు జరిగాయి. పార్టీవ దేహానికి పలువురు ప్రజా ప్రతినిధులు, సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నివాళులర్పించారు. నారా రామ్మూర్తినాయుడు ఈ నెల 16న (శనివారం) మృతి చెందిన సంగతి తెలిసిందే. అన్న అయిన చంద్రబాబు పాడె మోసారు. కొడుకు నారా రోహిత్ తల కొరివి పెట్టారు. ఈ రోజు చంద్రబాబు నారావారి పల్లెలో ఉండనున్నారు. తిరిగి రేపు అమరావతి చేరుకుంటారు.


