TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మా అభివృద్ధి అజెండా మాకుంది.. లోకేష్ ట్వీట్ వైరల్.!

Published on: Tue Aug 25, 2026 12:07PM

తమిళనాడులోని పరందూర్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టును   ఉపసంహరించుకుంటున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీ వేదికగా ప్రకటించేశారు.  ప్రస్తుత చెన్నై ఎయిర్‌పోర్ట్‌లోనే  ఐదో టెర్మినల్‌ను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నయాలు అన్వేషిస్తోందని ఆయన విస్పష్టంగా చెప్పారు.   దీనిపై నెట్టింట ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది.

 పరందూర్ విమానాశ్రయం ఏర్పాటుకు అక్కడి రైతుల నుంచి, స్థానికుల నుంచి వచ్చిన  వ్యతిరేకత కారణంగానే పరందూర్ విమానాశ్రయ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు తమిళనాడు సీఎం అసెంబ్లీ వేదికగా ప్రకటించడంతో నెట్టింట ఓ రేంజ్ లో జోకులు పేలుతున్నాయి. మద్రాస్ లో రెండో విమానాశ్రయానికి స్థలం సమస్య అయినా కంగారు పడొద్దంటూ నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబును అడిగితే.. ఆయనే   తమిళనాడు సరిహద్దుకు సమీపంలో ఏపీలోని   శ్రీసిటీ లో చెన్నై ప్రయాణికుల కోసం కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తారంటూ ఓ నెటిజన్ చేసిన పోస్టుపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆయన రీట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.  

ఏపీలో మేం ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం, మూడు ఆర్థిక రీజియన్ల అభివృద్ధి పనులతో చాలా చాలా బిజీగా ఉన్నామని పేర్కొన్న లోకేష్..  తమిళనాడు ఎయిర్‌పోర్ట్ సమస్యలు  టు డు జాబితాలో లేవన్నారు. సో తమిళనాడు కోసం శ్రీ సిటీలో విమానాశ్రయ నిర్మాణం ఆఫర్ ను వినమ్రంగా తిరస్కరిస్తున్నామంటూ లోకేష్  ట్వీట్  చేశారు.  ఎవరి పేరూ ఎత్తకుండానే..  లోకేష్ ఇచ్చిన పొలిటికల్ కౌంటర్ నెటిజనులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఆంధ్రప్రదేశ్ లో  ఇప్పటికే సొంతంగా ఏవియేషన్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నది. నెల్లూరు జిల్లా దగదర్తి వద్ద ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ పనులు పీపీపీ  పద్ధతిలో ముందుకు సాగుతున్నాయి. ఈ దగదర్తి ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే నెల్లూరుతో పాటు శ్రీసిటీ పారిశ్రామిక రంగానికి రవాణా పరంగా మేలు జరుగుతుంది.  అలాగే..   కుప్పం ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనలపై కూడా తమిళనాడు అసెంబ్లీలో డిఎంకె సభ్యులు చర్చించడం..  తమిళనాడు తమ విమానాశ్రయ సమస్యలను ఏపీపై నెట్టివేయాలని భావిస్తున్న సమయంలో ఏపీ తన అభివృద్ధి ఎజెండాతో బిజీగా ఉందంటూ.. తమిళనాడు విమానాశ్రయ సమస్యలపై తమ దృష్టి లేదని చమత్కారంగానైనా విస్పష్టంగా చెప్పడం విశేషం.  

Nara Lokesh Tweet on Parandur Airport, Sri City Airport, Amaravati Development, Polavaram Project, Tamil Nadu Politics, Andhra Pradesh Aviation