TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీతమ్మా.. థాంక్సమ్మా!

Published on: Tue Jul 23, 2024 1:59PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగర నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టుకు సంపూర్ణ సహకారం అందించడంతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు, అలాగే ప్రకాశం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కృతజ్ఞతా సందేశాన్ని ఆయన ఎక్స్.లో పోస్ట్ చేశారు. "ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, జీవనాడి పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయలు కేటాయించి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కట్టుబడిన ఎన్డీయే ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు" అని లోకేష్ పేర్కొన్నారు.