నారా లోకేశ్‌కు కొవిడ్ పాజిటివ్.. గెట్ వెల్ సూన్..
Published on: Mon Jan 17, 2022 1:41PM
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొవిడ్ బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయినట్టు ట్విటర్‌లో తెలిపారు. ఎలాంటి లక్షణాలు లేవని.. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు వెల్లడించారు.
గత కొన్ని రోజులుగా తనని కలిసిన వారంతా తొందరగా టెస్టులు చేయించుకోవాలని.. సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతిఒక్కరూ క్షేమంగా ఉండాలని లోకేశ్ ట్వీట్ చేశారు.
లోకేశ్‌కు కరోనా పాజిటివ్ అని తెలిసి.. టీడీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డారు. తన యువనేత తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.



