TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మెట్రో రైలు కారిడార్ల అభివృద్ధికి సాంకేతిక సహకారం అందించండి : మంత్రి లోకేష్

Published on: Thu Jun 4, 2026 9:16PM

 

మాస్కో రవాణా మంత్రి, వైస్ మేయర్ మాక్సిమ్ లిక్సుటోవ్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సెయింట్ పీటర్స్ బర్గ్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... భారత్ లోని మెట్రో పాలిటన్ నగరాల్లో మాస్కో తరహా ఏఐ ఆధారిత ట్రాన్సిట్ ట్రాకింగ్, స్మార్ట్ ట్రాఫిక్ నిర్వహణ సాఫ్ట్‌వేర్‌ను అమలు చేసేందుకు సహకారం అందించండి. మాస్కోలో మాదిరిగా అధిక సామర్థ్యం గల ఎలక్ట్రిక్ బస్సుల సముదాయాలు, స్మార్ట్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ప్రవేశపెట్టడానికి మాతో కలిసి భాగస్వామ్యం వహించండి. విశాఖపట్నం ఫిన్‌టెక్ వ్యాలీలోని మునిసిపల్ ట్రాన్సిట్ లైన్‌ల కోసం సురక్షితమైన ఫేషియల్-రికగ్నిషన్ టికెటింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించండి. 

భారతీయ నగరాల్లో ఇంటిగ్రేటెడ్ రైలు, మెట్రో, రోడ్డు ట్రాఫిక్ నియంత్రణ కమాండ్ సెంటర్ ఏర్పాటుకు మాస్కో రవాణా నిపుణులను నియమించండి. భారతదేశ సముద్ర సరుకు రవాణాను దేశీయ రైలు నెట్‌వర్క్‌లతో సజావుగా అనుసంధానించడానికి, భారతీయ ఓడరేవులలో మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ హబ్‌లు & డిజిటల్ ఫ్రైట్ కారిడార్ల ఏర్పాటుకు మాస్కో అధునాతన కార్గో ట్రాకింగ్, డిజిటల్ లాజిస్టిక్స్ ఆప్టిమైజేషన్ ప్లాట్‌ఫారమ్‌లను మోహరించండి. భారత్ లోని ప్రధాన మెట్రో కారిడార్లలో ప్రయాణికుల రైలు విస్తరణలను ఆప్టిమైజ్ చేయడానికి మాస్కో మెట్రో ఇంజనీరింగ్ నిపుణులను నియమించి, సాంకేతిక సహాకారాన్ని అందించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.