TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

బండ్ల గణేష్ కు లోకేష్ పరామర్శ.. ఎందుకంటే?

Published on: Tue Jan 27, 2026 11:24AM

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. శ్రీవారి మొక్కు తీర్చుకునేందుకు సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రగా తిరుమల వెడుతున్న బండ్ల గణేష్ కు నారా లోకేష్ ఫోన్  చేసి పరామర్శించారు.  పాదయాత్రగా తిరుమల వెడుతున్న బండ్ల గణేష్ కాలి నొప్పితో బాధపడుతున్నట్లు తెలుసుకున్న లోకేష్  ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు.   ఈ సందర్భంగా పాదయాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను లోకేష్ బండ్ల గణేష్ కు తెలియజేశారు. త్వరగా కొలుకుని మొక్కు తీర్చుకోవాలని ఆకాంక్షించారు. 

వైసీపీ హయాంలో  తెలుగుదేశం అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టైన సమయంలో  ఆయన కేసు నుంచి నిర్దోషిగా బయటపడితే కాలినకన తిరుమల వస్తానని మొక్కుకున్న బండ్ల గణేష్ ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకునేందుకు  ఈ నెల 19న షాద్‌నగర్‌లోని తన నివాసం నుంచి  సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం బండ్ల గణేశ్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది.