TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విశాఖ ఉక్కుపై పుకార్లను నమ్మొద్దు!

Published on: Thu Sep 26, 2024 2:31PM

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై చర్చ జరిగిందంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఏపీ మంత్రి లోకేష్ అన్నారు.  విశాఖ నోవాటెల్ లో సీఐఐ ఇన్ఫ్రా స్ట్రక్చర్ సదస్సులో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  భవిష్యత్ లో విశాఖకు ఏం చేయాలి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో పాటు భోగాపురానికి రోడ్డు, మెట్రో కనెక్టివిటీపై ఈ సదస్సులో చర్చించినట్లు చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ భాగంలో ఒక్కో జిల్లాకు ఒక్కో ఫోకస్ ఏరియా గతంలోనే టీడీపీ ప్రభుత్వం రూపొందించిందన్నారు. గతంలోనే అనేక పెట్టుబడులు వచ్చాయన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో స్పీడ్ బ్రేకర్ లా అవి ఆగిపోయాయి. వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు ఏం చేయాలనే అంశాలపై కూడా చర్చించామన్నారు.