TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

‘కుప్పం గడ్డ.. చంద్రన్న అడ్డ’.. జ‌గ‌న్‌రెడ్డిలో ఓట‌మి భ‌యం..

Published on: Fri Nov 12, 2021 11:03AM

కుప్పం అంటే ఒక పవిత్రమైన దేవాలయమని, ఇక్కడ గొడవలు ఉండవని, ఎన్నికలు శాంతియుతంగా జరుగుతాయని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ అన్నారు. కానీ, వైసీపీ ప్ర‌భుత్వం పోలీసుల సాయంతో కుప్పంలో శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్యలు సృష్టిస్తున్నార‌ని మండిప‌డ్డారు. జ‌గ‌న్‌రెడ్డిలో ఓట‌మి భ‌యం పెరిగింద‌ని.. అందుకే కుప్పంను టీడీపీ నుంచి దూరం చేసేందుకు కుట్ర‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. 

తనిఖీల పేరుతో  పోలీసుల వేధింపులకు గురిచేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. కుప్పం వెళ్లే అన్ని మార్గాల్లో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి టీడీపీ నేతలను అడుగడుగునా అడ్డుకుంటున్నారని విమర్శించారు. కుప్పం వెళ్లే ప్రతి వాహనాన్ని ఆపి.. ఎక్కడికి వెళ్ళుతున్నారంటూ ఆరా తీస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కుప్పం నియోజకవర్గంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఏ గడప తొక్కినా చంద్రన్న ముద్ర ఉంటుందని నారా లోకేష్ అన్నారు. గత రెండున్నారేళ్లుగా ఈ నియోజకవర్గానికి అధికారపార్టీ నేతలు ఎవరూ రాలేదని, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని విమర్శించారు. ఏ రోజైనా జగన్ రెడ్డి నోటి నుంచి కుప్పం అనే పదం వచ్చిందా? అని ప్రశ్నించారు నారా లోకేశ్‌. కుప్పంలో లోకేశ్ ప్ర‌చారానికి విశేష స్పంద‌న వ‌స్తోంది. కుప్పం మ‌రోసారి టీడీపీ అడ్డ‌గా నిలుస్తుంద‌ని అంటున్నారు.